20 March, 2026 | 9:17 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో అగ్ని ప్రమాదం

11-07-2024 02:20 AM

టప్పర్ వేర్ షాప్‌లో ఎగిసిపడిన మంటలు

మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది

గంటపాటు ట్రాఫిక్ జామ్

ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న టప్పర్ వేర్ షాప్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం 5 గంటలకు టప్పర్ వేర్ షాపును యజమాని సిబ్బంది మూసివేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో షాపులో సాయంత్రం 6 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. నెమ్మదిగా షాప్ మొత్తం మంటలు వ్యాపించడంతో షాప్‌లో ఉన్న ప్టాస్టిక్ సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో దట్టమైన పొగలు రావడంతో బిల్డింగ్‌లో చిక్కుకున్న గోద్రేజ్ కంపెనీకి చెందిన సురేందర్, శ్రీధర్‌ను చిక్కడపల్లి పోలీసులు కాపాడారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ అధికారులు దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా క్రాస్‌రోడ్డులో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు ఆర్పే సమయంలో ఓ ఫైర్ సిబ్బంది స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక దవాఖానాకు తరలించారు.