23 May, 2026 | 2:52 AM

జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం..

23-05-2026 02:02 AM

జామాయిల్, మామిడి తోటలు దగ్ధం

ఎర్రుపాలెం, మే 22 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, తాటిగూడెం రెవెన్యూ గ్రామాల్లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, మామిడి తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ఏడుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల ముప్పు గుంటల జామాయిల్ తోటలు, ఒక ఎకరం ముప్పు గుంటల మామిడి తోట మంటల్లో కాలిపోయాయి.

ఈ ఘటనలో జామాయిల్ తోటలకు సుమారు పది లక్షలు, మామిడి తోటకు రెండు లక్షల రూపాయలు వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.