calender_icon.png 8 May, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం.. మూడిళ్లు దగ్ధం

13-04-2025 10:19:08 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడు పంచాయతీలోని శివారు గ్రామమైన పాలగుంపులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్ళు పూర్తిగా దగ్దం అయ్యాయి.  మడకం రాజు,నల్లబెల్లి స్వప్న, కోర్సా భద్రం లకు చెందిన ఇండ్లు అగ్నికిహావుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది