23 March, 2026 | 8:06 AM

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

29-11-2025 08:58 AM
  1. పేట్ బషీరాబాద్‌లో అగ్నిప్రమాదం
  2. సుచిత్ర సెంటర్ లో టైర్ల షాపులో ఎగిసిపడ్డ మంటలు
  3. యజమానికి సుమారు రూ.2 కోట్లు ఆస్తి నష్టం 

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal district) పేట్ బషీరాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సుచిత్ర సెంటర్(Suchitra Center)లోని టైర్ల షాపులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో టైర్లు ఎక్కువగా ఉండటంతో మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేశాయి. ఈ భారీ అగ్నిప్రమాదంలో యజమానికి రూ.2 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంతమేర నష్టం వాటిల్లిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.