23 March, 2026 | 9:42 AM

కత్తులతో దాడి.. కాల్పులు జరిపిన పోలీసులు

29-11-2025 08:46 AM

కోవూరు: నెల్లూరు జిల్లా(Nellore District) కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. హత్యకేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. షుగర్ ఫ్యాక్టరీ(Sugar Factory) వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపై నిందితులు కత్తులతో దాడి చేయగా, కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయాలయ్యాయి. దీంతో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు జేమ్స్ మోకాలికి గాయాలయ్యాయి. పరారీలో ఉన్న మరో 9 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో  నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణకు చికిత్స అందిస్తున్నారు.