మాదాపూర్ సత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మాదాపూర్ లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.చుట్టుపక్కల వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం..ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో 5 వ అంతస్తులో బార్ అండ్ రెస్టారెంట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
తొలుత ఒక ఫ్లోర్ లో మొదలైన మంటలు క్రమంగా బిల్డింగ్ లో ఉన్న ఐదంతస్తులకు వ్యాపించాయి.దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా మంటలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.బిల్డింగ్ లో మంటలు వ్యాపించడంతో నైట్ షిఫ్ట్ చేస్తున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు.ఏం జరిగిందో అర్థం కాలేదని, దట్టమైన పొగ వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఓ ఉద్యోగి పేర్కొన్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.






