10-12-2025 01:07:04 PM
సూరత్: గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని(Surat) రాజ్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం(Fire Breaks Out) సంభవించింది. టెక్స్‌టైల్ మార్కెట్ భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు బహుళ అంతస్తులకు చేరాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాసక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. భవనంపై రెండు అంతస్తుల్లో దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో భవనంలోని వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ మాట్లాడుతూ... " మంటలను అదుపుచేసేందుకు సుమారు 20 నుండి 22 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. మంటలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. శీతలీకరణ పనులు కూడా జరుగుతున్నాయి. గిడ్డంగిలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. లోపల చాలా సామాగ్రి ఉంది. శీతలీకరణ పనులు జరుగుతున్నాయి. దీనికి కొంత సమయం పడుతుంది. దాదాపు 100 నుండి 125 మంది అగ్నిమాపక అధికారులు, ఉద్యోగులు మంటలను ఆర్పేందుకు నిమగ్నమై ఉన్నారు." అని ఫైర్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు.