10-12-2025 10:30:51 AM
జైపూర్: రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై(Jaipur-Bikaner National Highway) మంగళవారం రాత్రి బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. బికనీర్ నుండి జైపూర్ వైపు స్లీపర్ బస్సు ప్రయాణిస్తుండగా ఒకదానికొకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారని, గాయపడిన 15 మందిని సికార్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా, 13 మందిని ఫతేగఢ్‌లో ప్రాథమిక చికిత్స అందించారని పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సికార్ జిల్లా ఆసుపత్రి నుండి జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ సందర్శించి గుజరాత్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.