15 April, 2026 | 6:35 AM

ఆర్టీసీ బస్ భవన్‌లో అగ్ని ప్రమాదం

01-02-2026 12:02 AM

ఫైర్ సిబ్బంది అప్రమత్తం

ముషీరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ భవన్లో, సాయంత్రం, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్యులార్ విభాగంలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఉన్న యూపీఎస్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమా ద సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.