calender_icon.png 7 February, 2026 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో లేరు

01-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే మల్లారెడ్డి

శామీర్‌పేట్, జనవరి 31 (విజయక్రాంతి) : హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎమ్మె ల్యే మల్లారెడ్డి మండిపడ్డారు. శనివారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్‌పల్లి, ఎల్లాగూడెం గ్రామ కాంగ్రె స్ పార్టీ నాయకులు ఎల్లం వెంకటేష్, ఎల్లం సురేష్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, శ్రీకాం త్ ఆకుల రమేష్‌తో పాటు 30 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి వారికి బిఆర్‌ఎస్ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆది అజయ్, నాగరాజు లకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ గజ్జెల నాగేష్, యువ నాయకులు డాక్టర్ చామకూర భద్రారెడ్డి, ఎంసీ పల్లి మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.