calender_icon.png 2 February, 2026 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కోట నీలిమ

01-02-2026 12:03:32 AM

సికింద్రాబాద్, జనవరి 31 (విజయ క్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండ లం మేడారం సమక్క, సారలమ్మ వన దేవతలను శనివారం పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎండోమెంట్ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం వనదేవతల గద్దెల వద్ద గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం సమర్పించారు.

ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టిన శ్రీ సమ్మక్క సారలమ్మల గద్దె లు, ప్రాంగణం పునరుద్ధరణ పనులు మేడా రం జాతరకు వచ్చే కోట్లాది భక్తులకు మరిం త సౌకర్యవంతంగా మారాయన్నారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలు కాపాడే దిశగా మేడారం అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. అనంతరం వన దేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మల తల్లులను దర్శించుకొని  పూజలు నిర్వహించామని తెలిపారు.