28 March, 2026 | 3:19 AM

ఎంపీల క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం

19-10-2025 12:43 AM

-పలువురికి అస్వస్థత.. తప్పిన ప్రాణాపాయం 

-ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ సమీపంలో ఘటన

-మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశ రాజధాని న్యూఢిల్లీలోని బీడీ మార్గ్ ఎంపీల నివాస సముదాయంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. సముదాయంలో ని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో ఒక అంతస్థుకు అంటుకున్న మంటలు క్రమంగా మూ డంతస్థులకు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అం దుకున్న అగ్నిమాపక బృందాలు 14 ఫైర్ ఇంజిన్ల సాయంతో కొన్నిగంటల పాటు శ్ర మ పడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఆయా అపార్ట్‌మెంట్లలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రమాదాన్ని సత్వరం గు ర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. కొంద రు మాత్రం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ గృహ సముదాయం 2020ంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. చిన్నారులు పటాకులు కాలుస్తుండగా, ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫర్నీచర్‌కు అంటుకున్న మంటలు క్రమంగా మూడంతస్థులకు వ్యా పించాయని కొందరు చెప్తుండగా, షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించా యని మరొకందరు వెల్లడిస్తున్నారు. పార్లమెంట్ హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూ రంలోనే అగ్నిప్రమాదం సంభవించడంతో యంత్రాంగం ఒకింత ఆందోళనకు గురైంది. అగ్నిమాపకశాఖ మంటలను అదుపు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నది.