11-06-2025 01:20:48 PM
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లాబీలో(Jammu and Kashmir Assembly lobby) బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, కొన్ని పాత ఛాయాచిత్రాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారి తెలిపారు. ఉదయం 9.34 గంటలకు మంటలు చెలరేగాయని, కొన్ని నిమిషాల్లోనే అదుపు చేసామని అధికారి తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణం వెంటనే తెలియలేదని అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం అధికారి ఒకరు తెలిపారు. సివిల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో ఉన్న డబుల్ అంతస్తుల శాసనసభ లాబీ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన అన్నారు. సివిల్ సెక్రటేరియట్‌లోని స్థానిక అగ్నిమాపక కేంద్రం కొన్ని నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఆయన వెల్లడించారు. కొన్ని పాత ఛాయాచిత్రాలు, కొన్ని ఫర్నిచర్ వస్తువులు కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు.