30 August, 2026 | 9:19 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

మంగ్లీ బర్త్ డే పార్టీ.. గంజాయితో పాటు విదేశీ మద్యం పట్టివేత

11-06-2025 12:33 PM
  1. చేవెళ్ల త్రిపుర రిసార్టులో ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ.
  2. పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యం పట్టివేత. 
  3. బర్త్ డే పార్టీకి హాజరైన వారికి పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్.

హైదరాబాద్: ప్రముఖ తెలుగు మహిళా ఫోక్ సింగర్ మంగ్లీ(Female folk singer Mangli) పుట్టినరోజు వేడుక వివాదానికి దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి నగర శివార్లలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఈ పార్టీకి హాజరైన చాలా మంది అతిథులకు నిర్వహించిన డ్రగ్ పరీక్షలలో వారికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో సినిమా, రాజకీయ ప్రముఖులతో పాటు అనేక మంది యువత కూడా హాజరయ్యారు. 

పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) రిసార్ట్ పై దాడి చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు బయటపడ్డాయి. ఆ పార్టీలో ఉన్న చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. కొన్ని నమూనాలలో డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు తెలిసింది. డ్రగ్స్ వాడిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.