9 May, 2026 | 2:22 AM

డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు

09-05-2026 01:04 AM

మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

ఆమనగల్లు, మే 8, (విజయక్రాంతి): ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో శుక్రవారం భారీ మంటలు చెలరేగాయి. మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను కాల్చడంతోనే మంటలు వ్యాపించాయని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. మంటలతో దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వార్డు కౌన్సిలర్ పుల్లారెడ్డి అనూష సమాచారం అందజేయడంతో కల్వకుర్తి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డులో చెత్త దహనం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.