పాదయాత్ర ద్వారా కొండగట్టుకు..
09-05-2026 01:04 AM
భీమదేవరపల్లి ,మే 8 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయస్వామి మాలాధా రణ భక్తులు పాదయాత్ర చేసుకుంటూ కొండగట్టుకు శుక్రవారం బయలుదేరారు. భీమదేవరపల్లి మండలంలోని భక్తులు వేలాదిగా ఆంజనేయ స్వామి వారి మాలాధారణ చేసుకున్నారు.
భక్తులు పెద్ద ఎత్తున మాల విరమణ కోసం కొండగట్టుకు బయలుదేరుతున్నారు. శుక్రవారం కొండగట్టుకు బయలుదేరిన వారిలో మనుగొండ విజయ్, లావుడియా వెంకటేష్ లు ఉన్నారు. మాలాధారణ భక్తులకు భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి దగ్గరుండి సాగనంపారు.






