30-04-2025 11:55:17 PM
దట్టమైన పొగకు ఊపిరాడక 15 మంది మృతి..
కోల్‌కతాలో ఘటన..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో 14 మంది మృతిచెందారు. మరికొందరిని రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఫాల్‌పట్టి ముచ్ఛువా ప్రాంతంలోని రితురాజ్ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు అంటుకున్నాయి. ఘటన సంభవించిన సమయంలో హోటల్ గదుల్లో ఉన్న వారిని కాపాడేందుకు అగ్నిమాపకశాఖ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దట్టమైన పొగల కారణంగా ఊపిరాడక 15 మంది మృతిచెందారు. అగ్నిమాపక సిబ్బంది మరికొంతమందిని కాపాడగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదని, దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించామని కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్‌కుమార్ వర్మ తెలిపారు.