calender_icon.png 17 July, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపాల శాఖలో 19, 21 తేదీల్లో సేవలకు అంతరాయం

17-07-2025 12:31:21 PM

  1. పోస్ట్ ఆఫీసుల్లోఈనెల 22 నుంచి ఐటి 2.0 అమలు
  2. మహబూబ్ నగర్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ విజయజ్యోతి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తపాలా శాఖ(Postal Department) నిర్వహణలో సాంకేతిక మార్పులు రానున్నాయని ఈ సందర్భంగా ఈనెల 19, 21 తేదీల్లో తపాల సేవలకు అంతరాయం కలుగుతుందని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ విజయ జ్యోతి(Postal Superintendent Vijaya Jyoti) అన్నారు. సురక్షితమైన సేవల కోసం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అమలుకు రంగం సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా, సేవలన్నింటిని ఒకే గొడుగు క్రిందకు తెచ్చి అమలు చేయుటకు నిర్ణయించిన నేపథ్యంతో ఐ.టీ 2.0 పేరుతో నూతన సాఫ్ట్వేర్ రూపొందించారనితెలిపారు. ఈ సాఫ్ట్వేర్, కార్యకలాపాల డేటా భద్రతను పెంచుతుందన్నారు. ఉద్యోగుల పని సామర్థ్యం కూడా పెరగడమే కాక, సేవలు మెరుగవుతాయని పేర్కొన్నారు. 

తెలంగాణ సర్కిల్(Telangana Circle) అంతట ఐ.టీ 2.0 ను ఈనెల 22వ తేదీ నుంచి తపాలా శాఖ, తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా అమలు చేయనుందని, ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో,మన రాష్ట్రంలోని హైదరాబాద్ రీజియన్, తెలంగాణ సర్కిల్లోని నల్లగొండ తపాల డివిజన్లో అమలు చేస్తురన్నారు. ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ అంతట అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలియజేశారు. మహబూబ్ నగర్ తపాలా డివిజన్ పరిధిలోగల కార్యాలయాలు:* మహబూబ్ నగర్ హెచ్ ఓ,నాలుగు సబ్ డివిజన్స్ (మహబూబ్ నగర్ ఈస్ట్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్, నారాయణపేట సబ్ డివిజన్, మరియు గద్వాల్ సబ్ డివిజన్) పరిధిలోగల 368 బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లలో, మరియు 42 ఉప తపాలా కార్యాలయాల్లో I.T.2.0 సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే అధికారులు,ఉద్యోగులు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. 22వ తేదీ నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వస్తుందని తెలియజేశారు. రెండు రోజుల అంతరాయానికి వినియోగదారులు సహకరించి నూతన విధానాలకు స్వాగతం పలకాలని సూచించారు.