30-04-2025 11:56:53 PM
న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా మే 9న రష్యా రాజధాని మాస్కోలో అట్టహాసంగా విక్టరీ డే వేడుకలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈసారి కూడా మాస్కోలో వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉంది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై తాజాగా క్రెమ్లిన్‌లోని అధ్యక్ష కార్యాలయం నుంచి స్పష్టత వచ్చింది. భారత ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి.