calender_icon.png 17 July, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం సమావేశం

17-07-2025 12:42:22 PM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddyఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో(Union Minister Ashwini Vaishnaw) రేవంత్‌ సమావేశం ముగిసింది. అశ్వినీ వైష్ణవ్, రేవంత్ రెడ్డి సమావేశం సుమారు గంట పాటు సాగింది. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.