నల్లమల్లలో అగ్నిమాపక మాక్ డ్రిల్
19-05-2026 12:10 AM
ప్రమాదాల నివారణపై అవగాహన
అచ్చంపేట, మే 18: నల్లమల్ల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం సోమవారం భారీ స్థాయి మాక్ ఎక్స్సజ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పర్యవేక్షణలో రాసమల్లబావి, వట్టువర్లపల్లి, బ్రహ్మగిరి ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు.
డ్రోన్లు, అంబులెన్స్లు, అగ్నిమాపక శకటాలు, పోర్టబుల్ పంపులు వినియోగించి అగ్ని ప్రమాదాల నియంత్రణ, గ్రామస్థుల తరలింపు, అత్యవసర వైద్య సేవల నిర్వహణను ప్రదర్శించారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, అటవీ, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.






