19 May, 2026 | 4:17 AM

జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీలో ఆర్థిక అక్రమాలపై మరోసారి ఫిర్యాదు

19-05-2026 12:08 AM
  1. డీఎల్‌పీఓ వ్యవహారంపై గ్రామస్థుల తీవ్ర ఆరోపణలు
  2. రిసీవ్డ్ కాపీ సైతం ఇవ్వలేదని ఆందోళన

మానకొండూరు మే 18 (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలం జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అక్రమాలు, గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై గ్రామస్థులు మరోసారి సోమవారం జిల్లా అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో మార్చ్, ఏప్రిల్  మాసాలలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించారు. అయితే దాదాపు గంటన్నర పాటు, మధ్యాహ్నం 2 గంటలకు ఆడిటోరియం గేట్లు మూసివేసే వరకు వేచి ఉన్నప్పటికీ ఎలాంటి రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఫిర్యాదు కాపీ గల్లంతు

గ్రామస్థులు సమర్పించిన అసలు ఫిర్యాదులు గల్లంతయ్యాయని, సమర్పించిన ఆధారాలు, పత్రాలు, వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోకుండా విచారణ నిర్వహించారని ఆరోపించారు. ముఖ్యంగా, విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించే ముందే డి ఎల్ పి ఓ గ్రామస్థులకు అందజేయడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఇది విచారణ ముందే నిర్ణయించిన విధంగా జరిగిందనే సందేహాలను బలపరుస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి, అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

జీతం బకాయిలపై ప్రజావాణిలో ఫిర్యాదు.. రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదని ఆవేదన..

కరీంనగర్ జిల్లా మనకొండూరు మం డలం జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ కార్మికుడు ఎల్లయ్యకు 2019 నుండి 2025 మధ్య కాలానికి సంబంధించిన 16 నెలల జీతం ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపణలు వెలువడ్డా యి. ఈ విషయమై పలుమా ర్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎ లాంటి చర్యలు తీసుకోలేదని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామపంచాయతీలో నిరంతరం పారిశుధ్య పనులు నిర్వహించినప్పటికీ తనకు జీతం ఇవ్వలేదని, ఈ కారణం గా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.

అంతేకాకుండా, త్వరలో జీతం ఖాతాలో జమ అవుతుంది అ ని చెబుతూ అప్పటి పంచాయతీ కార్యదర్శి మరియు కారోబార్ అక్విటెన్స్ / బట్వాడా రి జిస్టర్లో తన బొటనవేలి ముద్రలను పలుమార్లు తీసుకున్నారని ఆరోపించారు. అయి తే జీతం మాత్రం చెల్లించలేదని పేర్కొన్నారు. తన అనారోగ్య సమస్యల సమయంలో మ నవడు కుమార్ రెండు నెలలు తన స్థానం లో గ్రామపంచాయతీలో పారిశుధ్య పనులు నిర్వహించాడని, అయితే అతనికి కూడా ఆ రెండు నెలల జీతం చెల్లించలేదని ఎల్లయ్య తెలిపారు.

సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఎల్లయ్య మరోసారి ఫిర్యాదు సమర్పించారు. ఫిర్యాదు ఇచ్చిన అనంతరం రిసీవ్డ్ కాపీ ఇస్తామని చెప్పి బ యట వేచి ఉండమన్నారు. దాదాపు గంటన్నర పాటు, మ.2 గంటలకు ఆడిటోరియం గేట్లు మూసివేసే వరకు వేచి ఉన్నప్పటికీ ఎలాంటి రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదని, తనకు న్యాయం ఎప్పటికీ దక్కుతుందో తెలియదని విజయక్రాంతితో ఆవేదన వ్యక్తం చేశారు.