calender_icon.png 19 October, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తెలంగాణలోకి హిడ్మా ఎంట్రీ..?

19-10-2025 02:58:29 PM

కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా ఆయన బెటాలియన్

తిరిగి ఆయన బెటాలియన్ తో కలిసి కర్రెగుట్టలపైకి వచ్చాడని ప్రచారం

మంథని,(విజయక్రాంతి): మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తలుగుతూనే ఉంది. కేంద్ర స్థాయి నాయకులు ఎన్ కౌంటర్ లో హతం కాగా, ఇటీవల వరుసగా కీలక నేతలు లొంగుబాట పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటు వాసుదేవరావు వంటి కీలక నేతలు ఆయుధాలు విడిచి పోలీసులకు సరెండర్ అయ్యారు. కాగా మరికొంతమంది ఇదే బాటలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా గురించి ఇప్పుడు తాజాగా చర్చ సాగుతుంది. హిడ్మా ఇపుడు ఎక్కడ ఉన్నాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది.

కేంద్ర, రాష్ట్ర కమిటీల నేతలు సాయుధ పోరాట విరమణ ప్రకటించి, ఆయుధాలు అప్పగిస్తున్నారు. అయినప్పటికీ హిడ్మా మాత్రం.. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఉద్యమంలో కొనసాగుతున్నాడు. అయితే ఇపుడు హిడ్మాను భద్రతా దళాలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టు కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న చింతల్నారు దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను, పోలీసులను హతమార్చిన జీరం ఘాటీ ఆంబుష్ వరకూ నేతృత్వం వహించింది, హిడ్మాయేనని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దీంతో హిడ్మాపై భద్రతా బలగాల ఫోకస్ పెట్టాయి. హిడ్మా కోసం భద్రతా బలగాల స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టినట్లుతెలుస్తోంది.

దీపావళిపై ఆంక్షలు.. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత!

మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ప్రకారం 250 మంది అనుచరులతో హిడ్మా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దండకారణ్య జోన్ లో సైనిక కమాండర్లలో హిడ్మా కీలకంగా ఉండటంతో ఇపుడు పార్టీ కార్యక్రమాల బాధ్యత ఆయన మీద పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల భారీ లొంగుబాటు కార్యక్రమంతో...హిడ్మాలో టెన్షన్ మొదలైనట్లు ప్రచారం సాగుతోంది. ఏప్రిల్లో జరిగిన ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి తప్పించుకున్న హిడ్మా ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడనే దానిపై క్లారిటీ లేదు. కానీ, ప్రస్తుతం అతను తెలంగాణలోకి వచ్చాడన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

పార్టీ అగ్రనేతలు హతం కావడం, పలువురు లొంగిపోవడంతో ప్రస్తత పార్టీ బాధ్యతలు కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మా, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి, దేవీల పైనే ఉంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ భవిష్యత్తు వారిద్దరి మీదే ఆదారపడి వుందని, ఆ పార్టీ సానుభూతిపరులు, మాజీలు, పలువురు లొంగిపోవడంతో ప్రస్తత పార్టీ బాధ్యతలు కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మా, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి, దేవీల పైనే ఉంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ భవిష్యత్తు వారిద్దరి మీదే ఆధారపడి వుందని ఆ పార్టీ సానుభూతిపరులు, మాజీ నక్సలైట్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా, ఆయన బెటాలియన్, తిరిగి కర్రెగుట్టల పైకి వచ్చారని చెబుతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు, గెరిల్లాలతో కలిసి సరిహద్దు దాటాడని, వారి రక్షణలోనే ఉన్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే హిడ్మాను పట్టుకునేందుకు భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి.