19-10-2025 03:00:56 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): తొలి తరం జర్నలిస్ట్ వరంగల్ వాణి ఎడిటర్ మాడబూషి ఎం.ఎస్ ఆచార్య పేరు మీద ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలంకు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ చేతుల మీదుగా అక్షర నేత్రం అవార్డుని అందజేశారు. ఆదివారం వరంగల్ జిల్లా ఆరేపల్లిలో మానవ వికాస రచనలు సంస్థ సీనియర్ జర్నలిస్టు నాగబెల్లి జితేందర్ రచించిన ఆరేపల్లి మట్టి బిడ్డలు పుస్తకావిష్కరణ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన జర్నలిస్టులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలంకు స్థానిక జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.