20-08-2025 10:29:42 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam) వద్దగల గోదావరి నేటి మట్టం బుధవారం ఉదయ 8.15 గంటలకు 43.00 అడుగులకు చేరుకున్నది . దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకో బడతాయని పేర్కొన్నారు. ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలన్నారు. అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.