calender_icon.png 20 August, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ రాష్ట్ర మహాసభలకి తరలివెళ్లిన లీడర్లు

20-08-2025 09:51:49 AM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభల కి ఏఐటీయూసీ, కమ్యూనిస్టు లీడర్లు(Communist leaders) తరలి వెళ్లారు. మేడ్చల్ జిల్లా కుతుబుల్లా పూర్ మండలం గాజులరామారంలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు బెల్లంపల్లి నియోజకవర్గం(Bellampalli Constituency) నుంచి బుధవారం  ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, దాగం మల్లేష్, బికేఎంయు జాతీయ సమితి సభ్యులు అక్కపెళ్లి బాపు, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి పట్టణం సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐ కె ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేకల రాజేశం, కొండు బానేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ వెళ్లారు.