calender_icon.png 20 August, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణపల్లి పీ హెచ్ సి ఎదుట ఆశాల ధర్నా

20-08-2025 10:58:54 AM

  1. మెడికల్ అధికారికి వినతి పత్రం అందజేత
  2. ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య 

మంగపేట,(విజయక్రాంతి ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని  ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని బ్రాహ్మణపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లు, ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాడె శ్రావ్య మంగళవారం బ్రాహ్మణపల్లి పీ హెచ్ సి ముందు ఆశాలతో ధర్నా చేసి మెడికల్ అధికారి నిఖిల్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు.

అనంతరం మడే శ్రావ్య మాట్లాడుతూ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో అందరికి ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు జులై నెల జీతాలకు తగిన  బడ్జెట్ లేదని జీతాలు వేయకుండా ఆశ వర్కర్ల  కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం  చేయడం సమంజసం కాదని ఇదేనా ప్రజా ప్రభుత్వం అని మడే శ్రావ్య ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నలిని స్వరూప, అమరావతి రాణి, విజయ కృష్ణవేణి, మేఘన పూలమ్మ, నాగమణి, పుణ్యవతి మిగతా ఆశ వర్కర్లు  పాల్గొన్నారు.