30 May, 2026 | 2:41 AM

వెన్నెల నగర్ స్థల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి

30-05-2026 12:56 AM

కొత్తగూడెం, మే 29, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెంలోని నూతన వెన్నెల నగర్ కాలనీలో 75 గజాల ప్రభుత్వ స్థల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ డిమాండ్ చేశారు నేడు వెన్నెల నగర్ లో జరిగిన స్టల లబ్ధిదారుల సమావేశంలో ఆయన మొదటి విడతలు నామమాత్ర కేటాయింపులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండో విడతలో పెండింగ్లో ఉన్న 550 మందికి ఇచ్చేలా స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. అవసరమైతే ప్రతి లబ్ధిదారుడి ఇల్లు 100 సార్లు సర్వే చేయాలని అందులో అనరులు ఉంటే ఇవ్వమని మేము డిమాండ్ చేయమని ఆయన తెలిపారు. రెండో విడతలు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్థానిక కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక చోరోవ చూపాలని కోరారు