8 July, 2026 | 8:15 AM

ఐదు రోజుల భారీ వర్షాలు

31-08-2024 12:26 AM

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐదు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని శుక్రవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తాయని చెప్పింది.