12 March, 2026 | 1:43 PM

రాష్ట్రంలో ఐదు రోజుల వర్షాలు

15-10-2024 03:12 AM

ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐంఎడీ

హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి): ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఐదురోజుల పాటు కొన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమ్రరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు తదితర  జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.