8 July, 2026 | 1:03 AM

కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన ములుగు డీఎస్‌పీ

08-07-2026 12:09 AM

ములుగు (మహబూబాబాద్) జూలై 7 (విజయక్రాంతి): ములుగు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా బంజరుపల్లిలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో గ్రామంలో ఉన్న సరైన ధృవ పత్రాలు లేని 9 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో సంచరిస్తున్న అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలెవరూ కూడా గుర్తు తెలియని వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు తమ ప్రాంతంలో సంచరిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు.

ఎవరైనా గంజాయి అమ్మిన సరఫరా చేసిన వారి సమాచారం అందించాలని సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ సురేష్, వెంకటాపూర్ ఎస్ ఐ రాజు, ములుగు ఎస్ ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.