31 August, 2026 | 10:14 PM

Breaking News

కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •  

500 నోట్లు కూడా రద్దు చేయాలి

09-06-2025 02:19 AM
  1. అప్పుడే అవినీతి అంతం అవుతుంది
  2. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

న్యూఢిల్లీ, జూన్ 8: దేశంలో అవినీతి అంతం కావాలంటే రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాతో ఆదివారం చంద్రబాబు మాట్లాడారు. ‘కేవలం రూ. 100, రూ. 200 నోట్లు మాత్రమే ఉండాలి. రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలి.

పెద్ద నోట్లను రద్దు చేస్తేనే మనం అవినీతి అంతం చేయగలం.’ అని తెలిపారు. 2016 నవంబర్‌లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నల్లధనం, అవినీతి మీద పోరాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.

ఉచితాల గురించి కూడా చంద్రబాబు స్పందించారు. ‘ఉచితాలు అనే పదం సరైంది కాదు. గతంలో పెద్ద ఎత్తున సంక్షేమం ఉండేది కాదు. ఎన్టీఆర్ హయాంలోనే సంక్షేమం మొదలైంది. ప్రస్తుతం సంపద సృష్టించుకుంటూ సంక్షేమం అమలు చేస్తున్నాం. కానీ సమాజంలో ధనికులు, పేదలు అనే తేడా రోజురోజుకూ పెరుగుతోంది.’ అని పేర్కొన్నారు.