17 August, 2026 | 3:04 PM

5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి!

24-05-2024 01:32 AM

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ

హాజరుకానున్న 4.౨౭ లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, మే 2౩ (విజయక్రాంతి):  ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. వార్షిక పరీక్షల్లోనూ ఇదే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఒకేరోజున నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,౨౭,౦౧౫  మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 9౨౬ పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 

చివరి నిమిషం వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం 

శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నా.. చివరి నిమిషం వరకూ పరీక్ష ఫీజు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రూ.వెయ్యి ఫీజుతో ఈ నెల 16 వరకు, రూ.2 వేలు ఆలస్య రుసుంతో ఈ నెల 23 మధ్యాహ్నం 3 గంటల వరకూ ఇంటర్ బోర్డు అధికారులు అవకాశం కల్పించారు. అయినా ఫీజు చెల్లించని వారికోసం శుక్రవారం మధ్యాహ్నం వరకు మరోసారి అవకాశమివ్వడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. విద్యార్థులు, పేరెంట్స్, కళాశాలల విజ్ఞప్తి మేరకే ఫీజు కట్టుకునేందుకు మరో అవకాశం ఇచ్చినట్టు బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఎడ్‌సెట్‌కు 87% మంది హాజరు

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి):  బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృనాళిని తల్లా పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా రెండు విడుతలుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 79 సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్టు ఆమె తెలిపారు. మొత్తం 33,879 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా మొదటి సెషన్‌లో 16,321 మందికి 14,633 (86 శాతం) మంది హాజరయ్యారు. రెండో సెషన్‌లో 16,950 మంది విద్యార్థులకు 14,830 (87 శాతం) మంది పరీక్ష రాశారు. రెండు సెషన్లు కలిపి మొత్తం 29,463 (87 శాతం) మంది పరీక్ష రాసినట్టు వెల్లడించారు.