కళాశాలను అభివృద్ధి చేసుకుందాం
వనపర్తి, మే 23 (విజయక్రాంతి): వనపర్తి నడిబొడ్డున గల చారిత్రాత్మక కట్టడమైన పాలిటెక్నిక్ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకింగ్ నిర్వహించి కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల ఆవరణలో ఉన్న పురాతన బావికి జాలి ఏర్పాటు చేయడంతో పాటు మైదానంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేశ్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యువత సన్మార్గంలో నడవాలి..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే అన్నారు. పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, మండల పార్టీ సమన్వయ కర్త శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు వెంకటమ్మ, సాయిరెడ్డిల జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలను నిర్వహించగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుప్రసాద్, సాయిచరణ్ రెడ్డి పాల్గొన్నారు.






