14 July, 2026 | 4:22 AM

బాధిత కుటుంబానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు అందజేత

14-07-2026 01:45 AM

మొయినాబాద్, జూలై 13 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు డప్పు కరంచంద్ కుటుంబానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీని అమలు చేశారు. కరంచంద్ ముగ్గురు పిల్లల పేరుపై రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలను ఫికస్డ్ డిపాజిట్ చేసి, వాటి బాండ్లను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి సోమవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం చురుకుగా పనిచేసిన కరంచంద్ సేవలను బీఆర్‌ఎస్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.

ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కేటీఆర్ ఇచ్చిన మాట ప్ర కారం పిల్లల ఉన్నత విద్య కోసం వారి పేర్లపై ఫికస్డ్ డిపాజిట్ చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఫికస్డ్ డిపాజిట్ బాండ్లు అందుకున్న కరంచంద్ కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించగా, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు కోట్ల న రోత్తంరెడ్డి రూ.25 వేల సాయం చేశారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, కొత్త నరసింహారెడ్డి, శ్రీహరి యాదవ్, మాణిక్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, జయవంత్, రవి యాదవ్, సురేందర్ గౌడ్, కుమ్మరి రాము, షాబాద్ శ్యామ్రావు, నరసింహ గౌడ్, శ్రీనివాస్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.