06-12-2025 08:02:26 PM
ములకలపల్లి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ముల్కలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి(సీఈవో) బి.నాగలక్ష్మి సందర్శించారు. మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండల పరిషత్ సిబ్బందికి ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు, ఎంపీవో రమేష్ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.