calender_icon.png 5 December, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసౌకర్యంగా ఉన్న రోడ్డుకు చదును

05-12-2025 01:42:38 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్, గుంటిగూడెం, బాలాజీనగర్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఘట్ కేసర్ మాజీ సర్పంచ్, జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అబ్బసాని యాదగిరియాదవ్ గురువారం ప్రజలకు రోడ్డు సౌకర్యవంతంగా ఉండే విధంగా చదును చేయించారు.

గుంటిగూడం నుండి ఎర్రమల్లెవాగు నుంచి బ్రూక్ బాండ్ వెంచర్ నుండి ఘట్ కేసర్ పట్టణo లోనికి వెళ్లే దారిలో రోడ్డు సరిగ్గా లేకపోడం, పిచ్చి చెట్లు, గుంతలు, ఉండడంతో స్థానిక ప్రజలు తెలుపడంతో జెసిబి సంజీవ సహకారంతో ఇరువైపుల రోడ్లను, గుంతలను చదును చేయించడం జరిగింది. ఇందుకు గాను స్థానిక ప్రజలు హర్షo వ్యక్తం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో గుంటిగూడం ప్రజలు యాదగిరి, మహంకాళి నవీన్, మంచాల విజయ్, వేల్పుల కరుణాకర్, షబ్బీర్, సురేష్, తోట నవీన్, తదితరులు పాల్గొనడం జరిగింది.