గోదావరి నది ఉదృతం..!
20-07-2024 03:17 PM
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఏజెన్సీలో వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 2:00కు భద్రాచలం వద్ద 34.4 అడుగుల గోదావరి ప్రవహిస్తోంది. ఇవాళ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 37 నుంచి 38 అడుగుల పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భద్రాచలం ఏజెన్సీకి ఎగువ భాగంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంద్రావతి రైజింగ్ లో ఉంది. శబరి ఉధృతి కూడా పెరుగుతుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు ఇంకా ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు ఈనెల 21 వరకు తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.






