calender_icon.png 14 August, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు వేదికకు దారేది?

14-08-2025 02:56:30 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు బురద కూపాలుగా మారిపోయాయి. ఏకధాటిగా కురిసిన వర్షం నీరు చేరి బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతు వేదిక భవనం చిత్తడిగా మారింది. వర్షాకాలం కావడంతో పంటలకు సంబంధించిన సలహాలు తెలుసుకునేందుకు రైతులు రైతు వేదికలలో(Rythu Vedika) అందుబాటులో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వర్షాల దాటికి రైతు వేదిక భవనం ఎదుట పూర్తిగా వరద నీరు చేరి చెరువును తలపించడంతో రైతులు సలహాల కోసం రైతు వేదిక వద్దకు వచ్చేందుకు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. విధుల నిర్వహణలో వ్యవసాయ అధికారులకు సైతం తిప్పలు తప్పని పరిస్థితి తలెత్తింది.