calender_icon.png 14 August, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయస్థానం సంచలన తీర్పు

14-08-2025 02:24:06 PM

ఉరి శిక్ష విధించిన ఫోక్సోకోర్టు..! 

నల్లగొండ టౌన్, (విజయ క్రాంతి ):నల్లగొండ జిల్లా కేంద్రం లో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్ స్టేషన్(One Town Police Station) పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలికపై మన్యం చెల్క లో హైదర్ ఖాన్ గూడ(Hyder khan guda)లో అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రంను ఫాక్సో ఇంచార్జి న్యాయమూర్తి రోజా రమణి గురువారం ఉరిశిక్షకు తీర్పు ఇచ్చారు. SC No:121/2015  376-A, 302, 201 IPC , POCSO చట్టం 2012లోని సెక్షన్ 6 కింద నిందితుడిని దోషిగా నిర్ధారించారు.తీర్పులో భాగంగా రూ.1,10,000 జరిమానా విధించగా, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆ బాలిక తల్లి మాట్లాడుతూ 13 ఏండ్లు ఈ సంఘటన జరిగిన తరువాత మా కుటుంబానికి న్యాయం జరిగింది అని ఆమె తెలిపారు.ఇలాంటి వారికి ఊరి శిక్ష నే సరైనదని తెలిపారు.