calender_icon.png 14 August, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబోయ్ రోడ్లు... ఈ గుంతలు పూడ్చే దెప్పుడు?

14-08-2025 02:30:23 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో(Bellampalli town) ప్రధాన రోడ్లు అద్వాన్నంగా మారాయి. నిత్యం జల సంబంధంగా ఉండే రోడ్లే ఆస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఈ రోడ్లపై రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెల్లంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం నుండి కన్నాల బస్తి ఫ్లైఓవర్ వరకు గల ప్రధాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితోనుండి ప్రమాదకరంగా తయారయ్యాయి. పాత జిఎం కార్యాలయం ఎదుట గల గాంధీ విగ్రహం వద్ద రోడ్డు మృత్యకుహరంగా మారింది. కాంటా చౌరస్తా, టేకుల బస్తీ, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో గల ప్రధాన రహదారి పై భారీ గుంతలు ఏర్పడ్డాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అధ్వానంగా తయారైన ప్రధాన రహదారికి మరమ్మత్తులు జరిపించి ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.