14-08-2025 02:42:16 PM
మూసాపేట : రాత్రి కురిసిన అకాల వర్షానికి మండల పరిధిలోని పోల్కంపల్లి శివారులో గల పెద్దమ్మ వాగు సమీపంలో బడుగుల వెంకటయ్య వెంకట్రాములు శ్రీను సేరి పెద్ద మల్లయ్య తిరుపతయ్య 5 మంది గొర్ల కాపారులవి 1000 గొర్రెలనిపెద్దమ్మ వాగు పక్కల రాత్రిపూట అక్కడ ఆపారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి పెద్దమ్మ వాగు నిండుగా ప్రవహించడంతో పక్కనే ఉన్న గొర్రె మంద చుట్టూ నీరు చేరుకోవడంతో గొర్రెల కాపారులు ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి(MLA Madhusudhan Reddy)కి సమాచారం అందించారు. వెంటనే ఎమ్మెల్యే జిఎంఆర్ హుటాహుటిన పోల్కంపల్లి గ్రామానికి చేరుకొని రెస్క్యూ టీం కు సమాచారం అందించారు.
ప్రత్యేక బోట్లు తీసుకువచ్చి ఎమ్మెల్యే వాగులో చిక్కుకున్న గొర్రెల మంద(Flock of sheep)తో పాటు గొర్రెల కాపారుల దగ్గరికి వెళ్లారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా చిక్కుకున్న గొర్రెల మందను పూర్తిస్థాయిలో బయటికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు గొర్రెల కాపర్లు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వస్తున్న వర్షాలను పర్యటనకు తీసుకొని అవసరమైన జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న సమాచారం అందించాలని తక్షణమే చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ముసాపేట కాంగ్రెస్ పార్టీ(Moosapet Congress Party) మండల అధ్యక్షులు శెట్టి శేఖర్, మూసాపేట మండల ఎస్సై వేణు మూసాపేట ఎమ్మార్వో రాజు నాయక్, ఆర్ ఐ అరుణ్ కుమార్ అడ్డాకల్ ఎస్సై మూసాపేట అడ్డాకుల పోలీస్, ఎమ్మార్వో సిబ్బంది గ్రామస్తుల గ్రామ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు నర్సింహా సీనియర్ నాయకులు రామన్ గౌడ్, పల్లి రాములు, మహేశ్వర్, సూరి, బైకని శ్రీనివాసలు, శ్రీకాంత్, అందరి సహకారంతో గొర్ల కాపరులని గొర్రెలని సురక్షితంగా బయటకి తీసుకురావడంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.