07-12-2025 07:10:46 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65పై జరుగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసి పట్టణ ప్రజల సమస్యలను తీర్చాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నల్గొండ కేంద్రంలో వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి 65పై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ నెమ్మదిగా సాగుతుండడం వల్ల పట్టణ ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పనులను వేగవంతం చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కన్నెబోయిన మాలింగం, శీను, కన్నెబోయిన మురళీకృష్ణ, తదితర నాయకులు ఉన్నారు.