07-12-2025 06:58:19 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 9 ఉదయం 6 నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.