12 May, 2026 | 12:11 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

క్రీడా అభివృద్ధికి అండగా తలసాని..

07-12-2025 07:15 PM

మెడల్ విజేతలకు ఘన సన్మానం..

సనత్‌నగర్ (విజయక్రాంతి): జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించే విధంగా మరింత శ్రమించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట డివిజన్ బల్కంపేటలో గల శ్రీ హనుమాన్ వ్యాయామశాలకు యువకులు, విద్యార్థులు ఇటీవల జరిగిన పోటీలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. ఆదివారం వ్యాయామశాల నిర్వాహకులు రాజు ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను  మర్యాద పూర్వకంగా కలిశారు. మెడల్స్ సాధించిన వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

తమ వ్యాయామశాలకు చెందిన గురు వివిధ విభాగాలలో మెడల్స్ సాధించారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నిర్వాహకుడు రాజు వివరించారు. గత నెలలో జియాగూడా లో నిర్వహించిన రెజ్లింగ్ పోటీలలో మణికంఠ 75 కిలోల విభాగం  గోల్డ్ మెడల్, 70 కిలోల విభాగంలో బన్నీ సిల్వర్ మెడల్, అదేవిధంగా పవర్ లిఫ్టింగ్ లో శ్రవణ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారు బ్రోన్జ్ మెడల్స్ సాదించారు. తమ వ్యాయామశాల అభివృద్ధి కి అన్ని విధాలుగా సహకరిస్తూ, అవసరమైన క్రీడా పరికరాలను అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అమీర్ పేట డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, బలరాం, వనం శ్రీనివాస్, హరిసింగ్ తదితరులు ఉన్నారు.