అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
17-03-2026 01:28 AM
అలంపూర్, మార్చి 16 :అలంపూర్ నియోజకవర్గంలో నెలకొన్న పెండింగ్ పనులు అలాగే అభివృద్ధి పనులపై దృష్టి సారించారని ఎమ్మెల్యే విజయుడు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పిటిసి హనుమంతు రెడ్డి, నాయకులు ఈర్లదిన్నె రంగారెడ్డి, వావిలాల రంగారెడ్డి, రఘు రెడ్డి అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.




