calender_icon.png 3 November, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానపద కళారూపం.. జడకొప్పు కోలాటం

02-11-2025 12:28:24 AM

కనుమరుగవుతున్న కళకు జీవం పోస్తున్న గ్రామీణులు

ఒకచేతితో కోలా, మరోచేతితో చీర అంచును పట్టుకొని జానపద పాటలకు అనుగుణంగా లయబద్ధంగా కోలలు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ జడ అల్లడం  కళలోని ప్రత్యేకత. తబలా, డోలక్ వంటి వాయిద్యాలను వాయిస్తూ పాటలు పాడుతూ సాగుతుంది.  కాలగమనంలో కళ అంతరించిపోకుండా నేటికీ అక్కడక్కడ పల్లెల్లో కళను ప్రదర్శిస్త్తూ కాపాడుకుంటున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు జానపద కళాకారులు.  

కార్తీక మాసం సందర్భంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జడకొప్పు కోలాటం ప్రదర్శనలతో కళాకారులు కనువిందు చేశారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని చించర్ వాడతో పాటు, రూరల్ మండలంలోని జందాపూర్ గ్రామంలో జడకొప్పు కోలాటం ప్రదర్శన ఏర్పాటు చేశారు.  ఈ ప్రదర్శన ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ జడకొప్పు కోలాటంలోని లయ, నృత్యం, గానం, సంగీత, సాహిత్యం అందరిని ఆకట్టుకున్నాయి. 

ఐదు రకాల జడలను అల్లుతూ..

ఆరం పది రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జడకొప్పులాటలో పలు రకాల జడలను అల్లుతూ విప్పుతూ చేసే ప్రదర్శనననే జడ కొప్పులాటగా పిలుస్తారు. ఇందులో ఓనామా జడ, తడక జడ, కృష్ణ జడ, లక్ష్మీజడ, మంగళ హారతి జడ ఇలా ఐదు రకాల జడలను అల్లుతారని జడకొప్పు కోలాటం కళాకారులు. అయితే ఎంతో విశిష్టత కలిగి ఉన్న ఈ కళ మరుగునపడే పరిస్థితులు నెలకొన్నాయని, ఈ అరుదైన జానపదకళను పరిక్షించుకోవాల్సిన అవసరం ఉందని కళాకారులు కోరుతున్నారు. 

 ఆదిలాబాద్, విజయక్రాంతి