14-01-2026 02:38:33 AM
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రిలో రోగు లకు, వారి సహాయకులకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో ) కేంద్ర సం ఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హు స్సేనీ (ముజీబ్) మంగళవారం అన్నదానం చేశారు. అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ఈ సేవలో భాగంగా, ఈ వారం కూడా డాక్టర్ ముజీబ్ స్వయంగా పాల్గొని రోగులకు అన్నదానం చేశారు.
కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓ. కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ క స్తూరి వెంకట్, హైదరాబాద్ (సిటీ) యూనియన్ అధ్యక్షుడు కె. శ్రీకాంత్, కార్యదర్శి కు ర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా కా ర్యవర్గ సభ్యుడు ఏ.వి.శ్రీధర్ పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర క్లాస్ ఎం ప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఖాదర్ బిన్ హసన్, ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆస్పత్రి ప్రెసిడెంట్ శివ కుమార్, ఉస్మాన్ అలీ, రామకృష్ణ, వహీద్ పాల్గొన్నారు.