14-01-2026 02:40:19 AM
గాంధీ నగర్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): అచ్చ తెలుగు సాంప్రదాయాలకు ప్రతిరూపంగా జరుపుకునే పండుగ సం క్రాంతి అని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాం తి ముగ్గుల పోటీలకు డివిజన్ లోని మహిళలు పాల్గొని పండుగ రంగు రంగుల ముగ్గులు వేసి పోటీ పడ్డారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సికింద్రా బాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి బండారు విజయ లక్ష్మి, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెం ట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్, ఉపాధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా మోర్చ నాయకులు లక్ష్మి, మంగమ్మ, సంయుక్త రాణి, పూర్ణ, అనుష, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, రఘు, మద్దూరి శివాజీ, మహేష్, కిరణ్, శ్రీకాంత్, సత్తి రెడ్డి, ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, రఘు యాదవ్, శేషి పాల్గొన్నారు.