14-01-2026 02:37:36 AM
కరింనగర్, జనవరి13(విజయక్రాంతి): కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావు కు మరో అవార్డు లభించింది.డెయిరీ రంగంలోచేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్ జోనా వారు జనవరి 2026- 8,9,10 తేదీలలో నిర్వహించిన సదరన్ డెయిరీ మరియు ఫుడ్ కాంక్లేవ్’ 2026 కార్యక్రమంలో క్షీర విప్లవ పితామ హుడు అయిన వర్గీస్ కురియన్ జన్మస్థలం కేరళ రాష్ట్రం కోజికోడ్లోని కాలికట్ ట్రేడ్ సెంటర్నందు ప్రతిష్టాత్మక ‘అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొపేషనల్ అవార్డ్ 2025 అందుకున్నారు.చైర్మన్ చురుకైన నాయకత్వంలో రోజుకు 12000 లీటర్ల పాలసేకరణ నుండి 2,00,000 (రెండు లక్షల) లీటర్ల పాలసేకరణ , పాల అమ్మకాలు రోజుకు 4000 లీటర్ల నుండి 1,80,000 లీటర్ల వరకు పాల అమ్మకాలు పెరిగాయి.
డెయిరీ యొక్క టర్నోవర్ను 7 కోట్ల నుండి 450 కోట్ల వరకు పెంచి, పాడిరైతుల ఆదా యాలను క్రమంగా పెంచుతూ, వినియోగదారులకు స్వచ్ఛమైన, రుచికరమైన , నాణ్యమైన పాలు, పాలపదార్ధాలు అందిస్తూ, వినియోగదారుల మన్ననలను పొందుచూ కరింనగర్ డెయిరీ ని తెలంగాణలో నెంబర్ వన్ స్థాయికి తీసుకు వచ్చారు. పాడిరైతులకు కళ్యాణ మస్తు, పాడిరైతు బరోసా, పాలనిధి వంటి సంక్షేమ కార్యక్రమాలు, పాడి పశువులకు పశు-ఆరోగ్య శిబిరాలు, పశుదాణ, సార్టెడ్ సేమెన్, చాఫ్కెట్టర్, పాడిపశువుల కొనుగోలుకు లోను, మరణించిన పాడిప శువులకు ఆర్ధిక సహాయం, వెటర్నరి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తూ నెంబర్-1 డెయిరీగా తీర్చిదిద్దినారు.సర్పంచ్ గా వున్న సమయములోనే రైతుల యొక్క ఆర్థిక స్థితి గతులను గ్రహించి రై తులకు వ్యవ సాయంతోపాటు పాడి పరిశ్రమ మాత్రమే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గమని భావించి పాడిపరిశ్రమ వైపు మొగ్గు చూపి ఈ రంగంలో అడుగు పెట్టారు.